సేవలు

తానా ఫౌండేషన్ ద్వారా తెలుగు వారికోసం జయ్ గారు చేసిన సేవలు:

 • తానా కొసం అన్నగారు డా|| రాజా తాళ్లూరి తో కలిసి సొంత నిధుల నుండి $250,000 మరియు సన్నిహితుల నుండి $500,000 విరాళాల సేకరణ.
 • కాకినాడ ప్రాంతం లో “వారధి ప్రాజెక్ట్” ద్వారా 560 అనాధలకు ఉచిత విద్య, సంక్షేమం. “మనవూరి కోసం Recurring Deposit” వినూత్న కార్యక్రమం.
 • గుంటూరు లో తానా ఫౌండేషన్, గ్రేస్ ఫౌండేషన్ ద్వారా చేసిన కాన్సర్ క్యాంపు కి ధన సహాయం చేయడమే కాకుండా స్వయంగా వెళ్లి పాల్గొన్నారు. ఇది guinness world record లో కూడా చోటు సంపాదించుకుంది
 • ఫిలడెల్ఫియా లో కనెక్టికట్ లో డల్లాస్, ఆస్టిన్, డిట్రాయిట్ లో మన ఊరి కోసం 5k రన్ లో చురుకుగా పాల్గొని విజయవంతం చేయడం లో ముఖ్య భూమిక పోషించారు.
 • తానా ఫౌండేషన్ ద్వారా 6 కళాశాలలొ లైబ్రరీ మరియు బూర్గంపాడు లో కంప్యూటర్ ల్యాబ్ కట్టించారు.
 • Hepatitis B క్యాంపు తానా ఫౌండేషన్ ద్వారా స్వంత ఖర్చులతో విజయవంతం గా చేయడమైనది

“తాళ్ళూరి ఫౌండేషన్” మరియు ఇతర సంస్థల ద్వారా

 • www.myprogresscard.com, విద్యా రంగం లో వినూత్నసేవ. కోట్ల విలువ చేసే విజ్ఞానం, ఉచితంగా విద్యార్ధి ముంగిట్లో…
 • భద్రాచలంలో Jr. కాలేజీ కి కోటి రూపాయల విరాళం, 6 ప్రభుత్వ స్కూళ్ళ దత్తత, లైబ్రరీ ల నిర్మాణం.
 • DNF ద్వారా 250 స్కూళ్ళలో డిజిటల్ క్లాస్ రూమ్స్ మరియు శంకర ఐ ఫౌండేషన్ కోసం లక్ష డాలర్ల విరాళాల సేకరణ.
 • తమ “తాళ్ళూరి ట్రస్టు” ద్వారా ఎన్నో హెల్త్ మరియు కాన్సర్ కాంపులు నిర్వహించి వేలాది డాలర్లు సహాయం అందించారు.
 • ప్రతి నెల 700 డాలర్లు విద్యార్థులకి స్కాలర్షిప్ ద్వారా సహాయం చేస్తున్నారు
 • విశాఖ జిల్లా కోరువాడలో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం, బోర్ వెల్ల్స్ నిర్మాణం.
 • “తాళ్ళూరి ట్రస్టు” ద్వారా గత 11 సంవత్సరాలుగా 150 మంది అనాధలను చేరదీసి లక్షలాది రూపాయలతో “మదర్ స్వచ్చంద సంస్థ” ద్వారా వారికి ఉచిత విద్య, ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ ట్రస్ట్ ద్వారా ఇంకా ఖమ్మం జిల్లా లోని దాదాపు 8 స్కూళ్ళను దత్తతు తీసుకుని వారి ఉత్తీర్ణతా శాతాన్ని 25% నుండి 95% కి పెంచిన ఘనత సాధించారు. ఇంకా ఖమ్మం జిల్లాలోని ఎన్నో కళాశాలలకు, కాలేజీలకు డిజిటల్ క్లాస్రూము సౌకర్యం మరియు లైబ్రరీల స్థాపనకు సహకారం అందించారు.
 • “తాళ్ళూరి ట్రస్టు” తరఫున కాకినాడ లోని రంగరాయ మెడికల్ కాలేజీకి $10,000 ఆర్ధిక సహాయం చేసి అత్యంత ఉన్నత ప్రమాణాలతో లైబ్రరీ నెలకొల్పడానికి సహాయపడ్డారు. అలాగే తమ తల్లిదండ్రుల పేరు మీద భద్రాచలం కాలేజీ కి ఆడిటోరియం, భద్రాచలం మానసిక వికలాంగుల సంస్థకు నివాస సౌకర్యం కల్పించారు.
 • గత కొన్ని సంవత్సరాలుగా తాళ్ళూరి కుటుంబం తరఫున గోదావరి మరియు ఖమ్మం జిల్లాల్లోని వృధ్ధుల శరణాలయాలకు ఏడాదికి 2.5 లక్షలకు పైగా ఆర్ధిక సహాయం చేస్తున్నారు.
 • గత 6 సంవత్సరాలుగా “భద్రాద్రి బాల ఉత్సవ్” తరఫున మూడు రోజుల తెలుగు సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తూ దాదాపు 10,000 పిల్లలకు ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నారు. శ్రీ తాళ్ళూరి తెలుగు సంసృతి సంప్రదాయాలను చైతన్యపరిచే “భధ్రాద్రి బాల ఉత్సవ్” సంస్థకు ముఖ్య మద్దతుదారు.
 • తూ|| గోదావరి జిల్లాలో ఒక వృద్ధాశ్రమం, 1 అనాధ శరణాలయం, భద్రాచలం వద్ద 1 అనాధ శరణాలయాలకు ప్రతినెల ఆర్ధిక సహాయం షెల్టర్ల నిర్మాణం
 • ఎన్నో సంవత్సరాలుగా శంకర ఐ ఫౌండేషన్ కు సహాయ సహకారాలు అందిస్తూ “DNF” ద్వారా $100,000 సేకరించి విరాళాలుగా అందించడమే కాకుండా ఒక కొత్త శంకర ఐ ఫౌండేషన్ స్థాపనకు చేయూతనందించారు.
 • అమెరికాలోని “ఫీడ్ ద చిల్డ్రన్” కార్యక్రమానికి గత 20 సంవత్సరాలుగా ధన సహాయం అందిస్తున్నారు. తన తొలి సంపాదనతో సేవ చేయడం ఆరంభించి నేడు ఈ సంస్థకు చెందిన 25 మంది పిల్లలకు సహాయం చేస్తున్నారు. అలాగే అమెరికాలోని “వూండెడ్ వారియర్స్” సంస్థకు తోడ్పాటునిస్తూ పెద్ద వయసు ఉన్న వారికి ఉద్యోగ కల్పనలో చేయూతనిస్తున్నారు.
 • జయశేఖర్ తాళ్ళూరి గారు డిస్ట్రిక్ట్ NRI ఫెడరేషన్ వ్యవస్థాపక సభ్యుడిగా ఎన్నో నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టారు.
 • డిస్ట్రిక్ట్ NRI ఫెడరేషన్ తోడ్పాటుతో 100 కృత్రిమ అవయవాల దానం చేపట్టారు
 • బూర్గంపాడులో 500 మరుగుదొడ్లు నిర్మాణం, వనితల స్వయం ఉపాధి కోసం 3 Skill Development centers
 • తాళ్ళూరి ఫౌండేషన్ మరియు డిస్ట్రిక్ట్ NRI ఫెడరేషన్ సౌజన్యంతో బోర్వెల్స్ ప్రాజెక్టు నిర్మాణం.
 • బాడ్మింటన్ క్రీడాకారిణి రిత్విక షివాని కి లక్ష రూపాయల నగదు సహాయం చేశారు.
 • తమ స్వంత ఊరు విరివెండి పరిసర గ్రామాల్లో 3 అంగన్వాడి స్కూళ్ళు పునర్నిర్మించారు.
 • గోదావరి వరదల సమయంలో బాధితుల కోసం 5 లక్షల నగదును ముఖ్య మంత్రి చంద్ర బాబు గారిని కలిసి ఇవ్వడమే కాక మరో 6 లక్షల రూపాయల విలువైన ఆహార పదార్ధాలను పంచి పెట్టారు.
 • గత 4 సంవత్సరాలుగా ఖమ్మం జిల్లా పాల్వంచ లోని “యువసేన” సంఘంలోని 20 మంది చిన్నారులకు సంబంధించిన తిండి, బట్టలు, చదువు మొదలగు అవసరాలకు పూర్తిగా సహాయం చేస్తున్నారు.