ఫౌండేషన్

తానా ఫౌండేషన్ కి నా నిబద్ధత

‘తానా ఫౌండేషన్’ స్వయం ప్రతిపత్తి గల శాశ్వత సంస్థ, ఇది ఉత్తర అమెరికా తెలుగు సంఘానికి [తానా కి] అనుబంధ సంస్థ. అమెరికాలో, రెండు జంట తెలుగు రాష్ట్రాలలో అవసరార్థుల జీవన ప్రమాణాలు మెరుగు పరచడమే ఈ సంస్థ ఒక్క ముఖ్య ఆశయం. చిన్న, చిన్న ప్రయత్నాలతో మొదలయి ఇవాళ్టి రోజున పెద్ద సంస్థగా, ఉద్యమంగా రూపాంతరం చెందినది, ఆర్ధిక మరియు సాంకేతిక సహాయాలతో ఖండాంతరాలలో తెలుగు వారి జీవన ప్రమాణాలని మెరుగు పర్చడానికి తోడ్పడుతుంది ఈ సంస్థ.

తానాతో నా తొలి పరిచయం 2001 లో ‘ఫిలడల్ఫియా సమావేశాల్లో జరిగింది. తానాలో నా మొదటి పదవి కార్యకర్త పదవి అది 2006 నుండి 2009 వరకు తరువాత 2009 నుండి 2011 వరకు ట్రస్టీగా సేవలందించాను. 2011 నుండి ‘తానా ఫౌండేషన్’ తో అనుబంధం మొదలైంది, 2013 వరకు సెక్రటరీగా ఉన్న సమయంలో ‘కాన్ఫరెన్స్ ఎడ్వైసరి కమిటీ’లోను భాగస్వామ్యం వహించాను. 2013 లో ‘తానా ఫౌండేషన్’ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి 2015 వరకు సేవలు అందించాను. ఆ కాలంలో సదస్సులు, వైద్య శిబిరాలు, కొత్త కార్యక్రమాలు నిర్వహించాము. ఇవన్నీ ఫౌండేషన్ ట్రస్టీల, ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ల సహాయంతో, మాజీ చైర్మన్ శ్రీ దిలీప్ కూచిపూడి గారి సలహాలతో విజయవంతంగా నిర్వహించాము.

వారందరి సహాయ సహకారాలతో, శ్రీ దిలీప్ కూచిపూడి గారి దిశా నిర్దేశంలో నేను సుమారు ఇరవై కాన్సర్ సహాయ శిబిరాలు, పలు కంటి చికిత్స శిబిరాలు, గ్రహణం మొర్రి చికిత్సా మరియు హృద్రోగ సహాయ శిబిరాలు నిర్వహించాను. ఈ కాలంలో ‘తానా ఫౌండేషన్’ అత్యధిక వైద్య శిబిరాలు నిర్వహించించి అవసరమైన వారికి సాయపడింది. శ్రీ దిలీప్ కూచిపూడి గారి విలువైన సలహాలతో తానా ఫౌండేషన్ వెబ్ సైట్ ఆవిష్కరించి, ‘వారధి ప్రాజెక్టు’ని ప్రారంభించాను. ‘వారధి ప్రాజెక్టు’లో పలు కాన్సర్ సహాయక శిబిరాలు ఇతర విద్యా సహాయక శిబిరాలు నిర్వహించాను, గత కొద్ది సంవత్సరాలలో సుమారు $8,400 విరాళాలు సేకరించాము. వ్యకిగతంగా నేను తరుచు తానా కార్యక్రమాలకి సహాయ పడుతూ ఉంటాను, నా కుటుంబ సభ్యలతో కలసి సుమారు $20,000 వివిధ తానా కార్యక్రమాలకి విరాళంగా ఇచ్చాను. ఇంతే కాకుండా ఇరవై మంది డిగ్రీ విద్యార్థులకు తానా ఫౌండేషన్ ద్వారా సహాయ పడుతున్నాను.

అమెరికాలోని అతి పెద్ద భారతీయ సంఘాలలో ఒకటి మరియు ఎంతో చరిత్ర కలది అయినా తానా లో సభ్యుడైనందుకు నేనెల్లప్పుడు అమెరికన్ మరియు భారతీయ ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే దిశగా కృషి చేస్తూ వారికి సేవ చేసే మరిన్ని అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను. నా ఉద్దేశంలో తానా సంస్థ ఇక మరింత ఎత్తుకు ఎదగాల్సిన సమయం ఆసన్నమైంది, మనం కొత్త బాధ్యతలు చేపట్టాలి, శష బిషలు, చర్చలు గతం గతహః అని ముందుకు సాగాలి. దీనికి మనకి కావాల్సిన సాధనాలు ఉన్నాయి, సామర్ధ్యము ఉంది, ఎంత మందో మిత్రులు సహచరులు ఉన్నారు. ఇక తెర వెనుక నుంచి కాక ముందుండి సారధ్యం వహించాల్సిన సమయం, తరుణం ఆసన్నమైంది.

మనమందరము బాగస్వామ్యమై, గౌరవించే కీర్తి గల ఈ ప్రఖ్యాత సంస్థ ఇప్పుడు ఒక కీలికమైన మార్పు కోసం, నిర్ణాయక కూడలిలో ఉంది. మన చరిత్రని, ఖ్యాతిని, సంస్కృతిని కాలానుగుణంగా వస్తున్న మార్పులతో సంధించి తెలుగు జాతి సంస్కృతిని, సంప్రదాయాన్ని నవ్యంగా, సవ్యంగా భావితరాలకు అందజేయగల చురుకైన శక్తివంతమైన నేత కావాలి, క్రొత్త సారధి కోసం తానా ఎదురు చూస్తోంది . అందుచేత మన తానా సంస్థని అమెరికాలో మరియు జంట తెలుగు రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారికి అందుబాటులో ఉండి ప్రజలకి చేరువై సేవ చేసే ప్రత్యేకమయైన, క్రియాశీల సంస్థగా విజయపథాన నడపడానికి మీ అందరి సహాయ సహకారాలు నాకు అందించవసిందిగా ప్రార్ధన. మన అందరి ఉత్సాహం కలగలసి గొప్ప చేతనాశక్తిగా మారి ఒక కొత్త ప్రారంభంతో మెరుగైన భవిష్యత్తు కోసం తానాని, తానా ఫౌండేషన్ ని ముందుకు తీసుకెళ్దాం. ఇందుకు మీ ప్రతి ఒక్కరి ఓటు అవసరం, ప్రతి ఒక్క ఓటు ప్రాధాన్యం, రండి నాతొ గొంతు కలపండి, చేయి కలపండి, పదం కలపండి, మన తానాని క్రొత్త శిఖరాలకు తీసికెళ్దాం, ఇందుకు మొదటి అడుగుగా ముందుగా మీ అందరి ఓటు నాకు వేయండి. మీ అందరి సమయ సహకారాలు నా కృతఙ్ఞతలు.

గాడ్ బ్లెస్స్ అమెరికా, భారత్ మాతాకి జై

జై తానా, జయహో తానా