నా గురించి

వ్యక్తిగతం

శ్రీమతి భారతి దేవి మరియు శ్రీ తాళ్ళూరి పంచాక్షరయ్య గార్లు తాళ్ళూరి జయశేఖర్ గారి తల్లిదండ్రులు. శ్రీ పంచాక్షరయ్య గారు ప్రముఖ రాజకీయవేత్త, మానవతా వాదిగా అందరికీ సుపరిచితం. శ్రీ జయశేఖర్ తాళ్ళూరి గత 20 యేళ్ళకు పైగా న్యూయార్క్ లోని లాంగ్ ఐలాండ్లో ఉంటున్నారు. వారి జీవిత భాగస్వామి శ్రీమతి నీలిమ ఆయనకు అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండటమే కాక ఆయన చేసే అన్ని సేవా కార్యక్రమాలకు మొదటి మద్దతుదారుగా ఉంటారు. పదవ తరగతి చదువుతున్న కుమారుడు సాయి పంచాక్షర్, తొమ్మిదవ తరగతి చదువుతున్న కుమార్తె శ్రీ భావనతో కలిపి ఆనందకరమైన కుటుంబం తాళ్ళూరి గారిది.

వృత్తిగతం

  • భారతదేశం నుండి మెకానికల్ ఇంజినీరింగ్ లో బాచిలర్ పట్టా పొందిన శ్రీ తాళ్ళూరి గత 25 సంవత్సరాలుగా ఎన్నో వినూత్న ఆలోచనలకు కార్యరూపం ఇస్తూ వ్యాపార రంగంలో విజయ కేతనం ఎగురవేశారు. ప్రస్తుతం హాల్మార్క్ గ్రూపు సంస్థలకు అధ్యక్షులుగా ఉన్నారు.
  • న్యూయార్క్ “ఇండో-డొమినికన్ రిపబ్లిక్” వ్యాపార ఫోరంలో ఆ దేశ అధ్యక్షుని సమక్షంలో సారధ్యం వహించారు.
  • IT Serve నార్త్ఈస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు. డిస్ట్రిక్ట్ ఎన్ ఆర్ ఐ ఫౌండేషన్ (DNF) వ్యవస్థాపక సభ్యులు
  • 2001 సంవత్సరంలో శ్రీ తాళ్ళూరి గారిచే ఒక చిన్న సంస్థ గా స్థాపించబడిన “హాల్మార్క్ గ్లోబల్ టెక్నాలజీస్” నేడు ఎన్నో చిన్న సంస్థలను కలుపుకుని అనితర సాధ్యమైన రీతిలో 1000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది.
  • నేడు Hallmark Group లో Hallmark Global Technologies, Hallmark Health Care, HCR Group, HG Technologies, Scalene Works People Solutions, Tech One IT Staffing, Talluri Technologies, Talluri Textiles, My Progress Card, Nimble Accounting మొదలగు ఎన్నో కంపెనీలు ఉన్నాయి.
  • ICICI కంపెనీ ఇటీవల చేజిక్కించుకున్న ఆబ్జెక్ట్ సాఫ్ట్ గ్రూపుకు శ్రీ తాళ్ళూరి సహ వ్యవస్థాపకులు.
  • Talluri Textiles స్థాపించి దాదాపు 500 మందికి పైగా మాతృ భూమిలో ఉపాధి కల్పిస్తున్నారు.