Skip to main content
  • thumb image

    banner-1

  • thumb image

    banner-2

"కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు...మహా పురుషులౌతారు" అన్నది చిన్నప్పటి నుండి నేను విన్న మంచి మాట. మహా పురుషుడనిపించుకోవాలంటే ముందు కనీసం మనిషిగా జీవించాలి అన్నది నాకు నేనుగా నేర్చుకున్న జీవిత పాఠం. పెరిగి పెద్దవుతూ కష్టపడి చదువుకుని, తల్లిదండ్రుల ప్రేమతో, స్నేహితుల అభిమానంతో, సంఘ తోడ్పాటుతో ఎన్నో విజయాలను అందుకున్నాను...ఎంతో సంతృప్తికరమైన జీవితం అనుభవిస్తున్నాను. ఒక్కసారి తిరిగి చూసుకుంటే .. ఈ "జయు"డి విజయాల్లో ముఖ్య భూమిక వహించింది మాత్రం విలువలు నేర్పిన తెలుగు గడ్డ మరియు అవకాశాలందించిన అమెరికా గడ్డ అని నాకనిపిస్తుంది. మనిషి తనకీ, తన కుటుంబానికీ ఎంత సాధించుకున్నా దాని వల్ల వచ్చే సంతోషం మహా అయితే ఒక జీవిత కాలం. కానీ అవసరంలో ఉన్న పది కుటుంబాల్లో వెలుగు రేఖలు నింపగలిగితే దాని విలువ అనంతం..అసామాన్యం..అనిర్వచనీయం..అనుసరణీయం.. తెలుగు నేలపై నాతో పాటు చదువుకున్న ఎంతో మంది స్నేహితులకు రాని అవకాశం నాకు విధి కల్పించింది. ఉన్నతమైన ఉద్యోగావకాశాలు, వ్యాపార విజయాలు, సత్కారాలు, పురస్కారాలు ఎన్నో అందించింది. తిరిగి సమాజానికి ఎంతో కొంత చేస్తేనే ఈ విజయాలకి సార్ధకత అని నా ధృఢ విశ్వాసం. విదేశాల్లో ఉన్న తెలుగు వారికి, భారత దేశంలో ఉన్న తెలుగు వారికి మధ్య వారధిలా ఉన్న TANA సంస్థ ద్వారా ఎన్నో మంచి పనుల్లో పాలుపంచుకునే అవకాశం నాకు లభించింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో నేను పుట్టిన ఖమ్మం జిల్లాలోనే కాక..మరెన్నో ప్రాంతాల్లో విద్య, వైద్య పరమైన సహకారం అందించి ఆనందం పొందాను. నేను బ్రతికే ప్రతి క్షణం నా ఆనందం కోసమే అనుకుంటే నేనే ప్రపంచం అనిపిస్తుంది. కాదు...మన చుట్టూ ఉన్న వారు కూడా నవ్వుతూ ఉండాలి అనుకుంటే ప్రపంచమే నాదనిపిస్తుంది. ఇంకా ఎంతో చేయాలని...ఎన్నో సాధించాలని...తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను చైతన్య పరిచే విధంగా TANA కార్యక్రమాల ద్వారానే కాక సొంత వనరులెన్నింటినో ఆనందంగా ఖర్చు చేయడం తృప్తిని ఇస్తుంది. మీ అండదండలతో .. ఆత్మీయాభిమానాలతో మరింత ఉత్సాహంగా మరెన్నో వినూత్న ప్రయత్నాల ద్వారా మరింత మంది యువకులను చైతన్య పరిచి, పేదవారికి, వయసు పైబడిన అభాగ్యులకు, ఇబ్బందుల్లో ఉన్న వారికి చేయూతనిచ్చి ఆత్మానందాన్ని పొందడమే నా ధ్యేయమని మనవి చేస్తూ TANA అధ్యక్ష ఎన్నికల్లో నాకు మీ ఆశీర్వచనం అందించాలని కోరుకుంటూ.. మీ జయశేఖర్ తాళ్ళూరి (జే తాళ్ళూరి).

శ్రీమతి భారతి దేవి మరియు శ్రీ తాళ్ళూరి పంచాక్షరయ్య గార్లు తాళ్ళూరి జయశేఖర్ గారి తల్లిదండ్రులు. శ్రీ పంచాక్షరయ్య గారు ప్రముఖ రాజకీయవేత్త, మానవతా వాదిగా అందరికీ సుపరిచితం. శ్రీ జయశేఖర్ తాళ్ళూరి గత 20 యేళ్ళకు పైగా న్యూయార్క్ లోని లాంగ్ ఐలాండ్లో ఉంటున్నారు. వారి జీవిత భాగస్వామి శ్రీమతి నీలిమ ఆయనకు అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండటమే కాక ఆయన చేసే అన్ని సేవా కార్యక్రమాలకు మొదటి మద్దతుదారుగా ఉంటారు. పదవ తరగతి చదువుతున్న కుమారుడు సాయి పంచాక్షర్, తొమ్మిదవ తరగతి చదువుతున్న కుమార్తె శ్రీ భావనతో కలిపి ఆనందకరమైన కుటుంబం తాళ్ళూరి గారిది.

  • భారతదేశం నుండి మెకానికల్ ఇంజినీరింగ్ లో బాచిలర్ పట్టా పొందిన శ్రీ తాళ్ళూరి గత 25 సంవత్సరాలుగా ఎన్నో వినూత్న ఆలోచనలకు కార్యరూపం ఇస్తూ వ్యాపార రంగంలో విజయ కేతనం ఎగురవేశారు. ప్రస్తుతం హాల్మార్క్ గ్రూపు సంస్థలకు అధ్యక్షులుగా ఉన్నారు.
  • న్యూయార్క్ "ఇండో-డొమినికన్ రిపబ్లిక్" వ్యాపార ఫోరంలో ఆ దేశ అధ్యక్షుని సమక్షంలో సారధ్యం వహించారు.
  • IT Serve నార్త్ఈస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు. డిస్ట్రిక్ట్ ఎన్ ఆర్ ఐ ఫౌండేషన్ (DNF) వ్యవస్థాపక సభ్యులు
  • 2001 సంవత్సరంలో శ్రీ తాళ్ళూరి గారిచే ఒక చిన్న సంస్థ గా స్థాపించబడిన "హాల్మార్క్ గ్లోబల్ టెక్నాలజీస్" నేడు ఎన్నో చిన్న సంస్థలను కలుపుకుని అనితర సాధ్యమైన రీతిలో 1000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది.
  • నేడు Hallmark Group లో Hallmark Global Technologies, Hallmark Health Care, HCR Group, HG Technologies, Scalene Works People Solutions, Tech One IT Staffing, Talluri Technologies, Talluri Textiles, My Progress Card, Nimble Accounting మొదలగు ఎన్నో కంపెనీలు ఉన్నాయి.
  • ICICI కంపెనీ ఇటీవల చేజిక్కించుకున్న ఆబ్జెక్ట్ సాఫ్ట్ గ్రూపుకు శ్రీ తాళ్ళూరి సహ వ్యవస్థాపకులు.
  • ఎన్నో స్థానిక, రాష్ట్ర, జాతీయ సంస్థల నుండి శ్రీ తాళ్ళూరి చేసిన సేవలకు పురస్కారాలు లభించాయి.

తానా తో 16 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం

  • 2001 ఫిలడెల్ఫియా కాన్ఫరెన్సులో తానా తో అనబంధం మొదలైంది
  • రెండేళ్ళ స్వచ్ఛంద సేవ, 8 సంవత్సరాలుగా తానా ఫౌండేషన్ లో వివిధ పదవులు చేపట్టారు. సంస్థ ఆశయాల సాధనలో అమెరికాలోనే కాకుండా మాతృభూమిలో కూడా సంఘ అభివృద్ధి లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.
  • తన కార్యదక్షత తో 2013-15 తానా ఫౌండేషన్ చైర్మన్ గా తానా కార్యక్రమాలని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళారు.
  • న్యూయార్క్ లో ఘనంగా 40 వ వార్షికోత్సవ ప్రారంభ ఉత్సవాల నిర్వహణ. హైదరాబాదులో మరియు ఖమ్మంలో కూడా..

Services

తానా కొసం అన్నగారు డా|| రాజా తాళ్లూరి తో కలిసి సొంత నిధుల నుండి $250,000 మరియు సన్నిహితుల నుండి $500,000 విరాళాల సేకరణ.

More..

"వారధి"-560 అనాధలకు ఉచిత విద్య, సంక్షేమం. "మనవూరి కోసం Recurring Deposit" వినూత్న కార్యక్రమం.

More..

కార్యవర్గాన్ని ఏకతాటిపై నడిపి మచ్చలేని నాయకుడుగా, అజాత శత్రువుగా అందరి మన్ననలు పొందారు.

More..

తానా చరిత్రలో అత్యధిక కాన్సర్ కాంపులు, గ్రామీణ ప్రాంతాలలో ఉచిత హృద్రోగం, గ్రహణం మొర్రి, కంటి చికిత్సలు.

More..

6 సంవత్సరాలుగా "భద్రాద్రి బాల ఉత్సవ్", దాదాపు 10,000 పిల్లలతో తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు

More..

భద్రాచలంలో Jr. కాలేజీ కి కోటి రూపాయల విరాళం, 6 ప్రభుత్వ స్కూళ్ళ దత్తత, లైబ్రరీ ల నిర్మాణం.

More..

గోదావరి వరదల బాధితులకు 11 లక్షలు, కర్నూలు వరద బాధితులకు 10 లక్షలు సహాయం

More..

గత 11 సం||గా ప్రతీ సంవత్సరం 150 మంది అనాధ/పేద విద్యార్ధులకు ప్రైవేటు స్కూల్స్ లో చదువు, ఇతర సౌకర్యాలు

More..

"తాళ్ళూరి ట్రస్టు" ద్వారా ఎన్నో హెల్త్ మరియు కాన్సర్ కాంపులు నిర్వహించి వేలాది డాలర్లు సహాయం అందించారు.

More..

అమెరికాలోని "ఫీడ్ ద చిల్డ్రన్" కార్యక్రమానికి గత 20 సంవత్సరాలుగా ధన సహాయం అందిస్తున్నారు.

More..

డిస్ట్రిక్ట్ NRI ఫెడరేషన్ తోడ్పాటుతో 100 కృత్రిమ అవయవాల దానం చేపట్టారు

More..

ఎన్నో సంవత్సరాలుగా శంకర ఐ ఫౌండేషన్ కు సహాయ సహకారాలు అందిస్తూ "జిల్లా ప్రవాస సమితి" ద్వారా $100,000 సేకరించి విరాళాలుగా అందించడమే కాకుండా ఒక కొత్త శంకర ఐ ఫౌండేషన్ స్థాపనకు చేయూతనందించారు.

More..

www.myprogresscard.com, విద్యా రంగం లో వినూత్నసేవ. కోట్ల విలువ చేసే విజ్ఞానం, ఉచితంగా విద్యార్ధి ముంగిట్లో...

More..

విశాఖ జిల్లా కోరువాడలో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం, బోర్ వెల్ల్స్ నిర్మాణం.

More..

గత కొన్ని సంవత్సరాలుగా తాళ్ళూరి కుటుంబం తరఫున గోదావరి మరియు ఖమ్మం జిల్లాల్లోని వృధ్ధుల శరణాలయాలకు ఏడాదికి 2.5 లక్షలకు పైగా ఆర్ధిక సహాయం చేస్తున్నారు.

More..

35 లక్షల తో గిరిజన విద్యాలయాలకు కంప్యూటర్లు తదితర సామగ్రి వితరణ

More..

అధ్యక్షునిగా విజయం సాధిస్తే

  • తానా ఆశయాలను, ఆదర్శాలను, పారదర్శకత విలువలను పరిరక్షిస్తూ సంస్థని మరింత మందికి చేరువ చేయడం
  • అందరికీ అందుబాటులో ఉండటం ద్వారా కార్యకర్తల భాగస్వామ్యం పెంచడం.
  • తెలుగు భాషా సంస్కృతులను పెంపొందించే మరిన్ని కార్యక్రమాలను నిర్వహించడం. జీవిత కాల సభ్యుల సంఖ్య 35k నుండి 100k కి పెంచడం.. వారికి మరిన్ని సదుపాయాల కల్పన.
  • ఇమ్మిగ్రేషన్ ఫోరం స్థాపించి విద్యార్ధులకు, F1/H1/L1 హోల్డర్లకి వీసా సంబంధిత విషయాల్లో మరింత చేయూత.
  • యువత భాగస్వామ్యం పెంచడం. స్థానిక సంస్థలతో కలిసి పని చేస్తూ సంస్థని మరింత ప్రాచుర్యం చేయడం.
  • US లోని యువతని సమీకరించి, వారిలో భావి నాయకత్వాన్ని ప్రోత్సహించడం.

Thank you all for your support in electing me as
TANA President Elect (EVP) 2017-2019.

Address

D-26, 200 motor parkway, Hauppauge, New York 11788

Phone

+1 (631) 998-6093
+1 (631) 523-1999